Assembly – ఆసిఫాబాద్ ఇక మున్సిపాలిటీ -అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటన

హైదరాబాద్ :
ఆసిఫాబాద్ ను కొత్తగా మునిసిపాలిటీ చేస్తునట్టు పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసెంబ్లీ ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీస్ ఏమైండ్మెంట్ 2023 సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఆసిఫాబాద్ ను కొత్తగా మున్సిపాలిటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇంతకాలం ఆసిఫాబాద్ గ్రామపంచాయతీగా ఉంది. కొత్త మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలను తొలగించాలన్నా, ఏర్పాటు చేయాలన్న ఈ బిల్లు అవసరం అని మంత్రి చెప్పారు. ఆసిఫాబాద్ ను కొత్తగా మున్సిపాలిటీ గా ఏర్పాటు చేశామని, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి రెండు గ్రామాలను తొలగిస్తూ ఈ బిల్లులో పొందుపరిచామని తెలిపారు.

ఆసిఫాబాద్ కు కొత్త కలెక్టర్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమించారు. నిర్మల్ జిల్లాలో అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న బోర్కడే హేమంత్ సహదేవరావు ను జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ బదిలీ చేశారు. ఆసిఫాబాద్ కలెక్టర్ గా ఇటీవల నియమించిన బాదావత్ సంతోష్ ను ఇక్కడి నుంచి బదిలీ చేశారు. నిజానికి ఈ జిల్లాకు మొదట ఐ ఏ ఎస్ ల బదిలీలు జరిగినప్పుడు యాస్మిన్ బాషా (మహిళా కలెక్టర్ ) ను నియమించారు. కానీ రాత్రికి రాత్రి ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేసి బాదావత్ సంతోష్ ను ఇక్కడ కలెక్టర్ గా నియమించారు. అయితే ఆసిఫాబాద్ లో ఎక్కువగా గోండు, కొలం, పర్దాన్ సామజిక వర్గాలకు చెందిన ప్రజలు ఉండటం, లంబాడి, ఇతర ఆదివాసీల మధ్య వివాదం ఉండటం నేపథ్యంలో బాదావత్ సంతోష్ (లంబాడి) ను ఇక్కడి నుంచి బదిలీ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest