DAY–1 పాదయాత్ర
పిప్పిరి (ఆదిలాబాద్) :
తెలంగాణ సి ఎల్ పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి షురూ అయింది. అంతకు ముందు హైదరాబాద్ లోని ఇంటి నుంచి బయలుదేరే ముందు భట్టి భార్య నందిని ఆయనకు హారతి ఇచ్చి సాగనంపారు.
బోథ్ నియోజకవర్గం పిప్పిరి లో కుమ్రంభీం విగ్రహానికి పూలమాలవేసి భట్టి పాదయాత్రను ప్రారంభించారు. నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొనసాగుతోంది. బ్యాండ్ మేళాలు, డప్పుల దరువులు, గిరిజనుల గుస్సాడి నృత్యాలు భట్టికి స్వాగతం పలికారు.
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రను ప్రారంభించిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, ఎఐసిసి కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పిసిసి మాజీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు తరలిరావడంతో జనసంద్రంగా మారిన పిప్పిరి గ్రామం జనసంద్రంగా మారింది. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్ పూలమాల వేసి నివాళ్లర్పించారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి పూలమాల వేసి నివాళుర్పించారు. స్థానికంగా ఉన్న లక్ష్మమ్మ కిరాణా దుకాణం వద్దకు వెళ్ళి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిప్పిరి నుంచి ఇచ్చోడకు వైపుకు భట్టి పాదయాత్ర సాగింది.
ఇచ్చోడ లో కార్నర్ మీటింగ్
ఇచ్చోడలో జరిగిన కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతో బి ఆర్ ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ లక్ష్యాలను నెరవేర్చకుండా అడ్డుగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి రాష్ట్ర లక్ష్యాలు, ఆశలు, ఆకాంక్షలు సాధించుకుందాం.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కోసం కాంగ్రెస్తో చేయి చేయి కలిపి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నడవాలని పిలుపు నిచ్చారు.
మనం ఏకమై ప్రజల సంపదను దోచుకుంటున్న మోడీ కేసీఆర్లను మూటకట్టి బజారులో పడేద్దాం. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న లక్ష్యాలు బిఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి నెరవేరలేదు. తొమ్మిది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో 18 లక్షల కోట్ల బడ్జెట్ 86% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సన్న చిన్న కారు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు తేలేదు. ప్రాణత్యాగాలకు ముందుకొచ్చి అగ్నికి ఆహుతై రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరవీరుల లక్ష్యాలు ఏ ఒక్కటి కూడా కెసిఆర్ నెరవేర్చలేదు. మనందరి బాగు కోసం తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్తోనే సాధ్యమని పెప్పరి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. మద్యాన్ని అమ్మండి అమ్మండి తాగండి తాగండి అని చెప్పడానికేనా తెలంగాణ తెచ్చుకుంది. జనాలను మద్యం మత్తులో నుంచి తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న కేసీఆర్ ఇక ఆటలు సాగవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్న బెల్టు షాపులు మూసివేస్తాం. 18 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పు డబ్బులు ఏమైనాయి? ఏ ప్రాజెక్టు కట్టారని 18 లక్షల కోట్లు తెలంగాణ సొమ్మును దోపిడీ చేశారు. లక్ష 25 వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలంగాణలో ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు ఇచ్చారా?తెలంగాణలో భారీ ప్రతి నీటి బొట్టు ఆనాటి కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచే పారుతున్నవి. శ్రీపాదఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేర్ ప్రాజెక్టుల నీళ్లను కాళేశ్వరం నీళ్లుగా చూపించి వీటిని నిర్మాణానికి ఖర్చుచేసిన లక్ష 25 వేల కోట్ల తెలంగాణ సొమ్మును దోపిడీ చేశారు. నోటిఫికేషన్లు వేయకుండా, వేసిన ఒక నోటిఫికేషన్ ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేసి లక్షల మంది యువతకు మానసిక క్షోభ పెట్టిన టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పడానికి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నా. గద్దర్ అన్న లాంటి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ దొరల రాజ్యం తెచ్చారు. ప్రశ్నిస్తే కేసులు అడిగితే అరెస్టులు నిలదీస్తే జైలు ప్రశ్నించిన వారిని వేధింపులకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలో ప్రశ్నించడమే ఆగిపోవడం వల్ల కళాకారులు మేధావులు, కవులు నిశ్శబ్దంగా ఉన్నారు.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం అని భట్టి చెప్పారు.