హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నడుస్తున్న వేల అసెంబ్లీ ఎమ్మెల్యేలు బడ్జెట్ గురించి మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గాని , ప్రభుత్వం చేసిన పనుల గురించి గాని పొగుడుతూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే. మానకొండూరు దళిత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బి ఆర్ ఎస్ దళిత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ప్రసంగంలో ఆడియోకు బి ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (దళిత నేత ) కౌంటర్ ఇచ్చాడు.
ఇంతకు రసమయి ఏం ? మాట్లాడాడు? ప్రవీణ్ కుమార్ ఏం కౌంటర్ ఇచ్చాడు? చూద్దాం. ఈ వీడియోను వినండి …అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వినండి.
రసమయి
చిటారు కొమ్మ గురించి ఆలోచించిండు దప్ప సదువుకున్న రెసిడెన్షియల్ మా పాఠశాలల పిల్లలు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి , ఎవరెస్టు శిఖరాన్ని కాళ్ళ కింద తొక్కేటట్టు చేసిండు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష!
ప్రవీణ్
అసలు ఆయనకేమన్న చరిత్ర తెలుసా? 2013 లో ఎవరెస్టు(everest) ఎక్కాలని చెప్పేసి అప్పుడు ఫైలు నేను సెక్రెటరీగా ఉన్నప్పుడే సైన్ చెయ్యడం జరిగింది. 2014మే 25నాడు ఆ అమ్మాయి ఎవరెస్టు శిఖరం ఎక్కింది. తెలంగాణ అప్పుడొచ్చింది.? జూన్ 2 నాడు వొచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి జూన్ లో ఎప్పుడో అయిండు.
బి ఆర్ ఎస్(BRS) ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ (rasamayi balakishan)ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)ను పొగడాలనే తాపత్రయం తప్ప ఎవరెస్టు ఎక్కిన ఆనంద్ , పూర్ణ ఏ డేట్ న ఎక్కారు అనేది సరిగ్గా చూసుకోలేదనేది ఆయన మాటల్లో స్పష్టమైంది.
బి ఎస్ పీ(BSP) చీఫ్ RS ప్రవీణ్ కుమార్ (pravinkumar)ఎవరెస్టు ఎప్పుడు ఎక్కింది అనే విషయాన్నీ మీడియాకు చెప్పి (ఇక్కడ కొన్ని మీడియా లోగోలు కనిపిస్తున్నాయి) తేదీ, ఏడాది కూడా చెప్పాడు. ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు నిజమే జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ప్రవీణ్ కుమార్ చోవర్లో కేసీఆర్ ముఖ్యమంత్రి జూన్ లో ఎప్పుడో ఆ అయిండు అన్నాడు…. జూన్ 2న తెలంగాణ ఆవిష్కృతమైంధి అదేరోజు కదా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించాడు. మరి ఈ విషయాన్నీ ప్రవీణ్ మరచిపోయినట్టు ఉన్నాడు ..అందుకే కాబోలు జూన్ లో ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యాడని మాట్లాడాడు. ఎవరెస్టు శిఖర ఎక్కింది ఈ పోస్ట్ లో కనిపిస్తున్న పూర్ణ తో పాటు ఆనంద్ అనే యువకుడు కూడా ఉన్నాడు కదా. సోషల్ మీడియాలో ప్రవీణ్ గురించి ప్రచారం చేస్తున్న మీడియా ఎందుకో మరి ఆనంద్ గురించి చెప్పలేదు. ప్రవీణ్ మాటల్లో కూడా ఆ అమ్మాయి అన్నాడు కానీ ఎవరెస్టు శిఖరాన్ని అబ్బాయి కూడా ఎక్కాడు … ఆ అబ్బాయి ఎక్కిన తేదీలు ఇవి అని చెప్పలేదు. అంటే ఇక్కడ ఈ మాటలు విన్న వారికి ఒక డౌట్ రావొచ్చు.
* 2014 మే 25 నాడు పూర్ణ అనే అమ్మాయి ఒక్కతే ఎవరెస్టు ఎక్కిందా ? లేక ఆమెతో కలిసి ఆనంద్ కూడా అదేరోజు ఎక్కడా ?
* లేక ఆనంద్ వేరే తేదీనాడు ఎవరెస్టు ఎక్కడా?
* ఒక వేల పూర్ణ , ఆనంద్ కలిసి ఒకేరోజు (అంటే ప్రవీణ్ చెప్పినట్టు 2015 మే 25నాడు) ఎవరెస్టు ఎక్కితే రసమయి బాలకిషన్ మాటల్లో తప్పు ఉండాలి భావించవచ్చు.
* ఆనంద్ -పూర్ణ ఒకే రోజు ఎవరెస్టు ఎక్కకపోతే మరి రసమయి చెప్పినట్టు ఆనంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఇక్కడేమో అనుకోవలసి వస్తుంది కదా ?
కాబట్టి సోషల్ మీడియాలో ఆధారాలు చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా మరొకరు ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రచారం చెయ్యాలి .