KCR మోడల్ విధ్వంసకర మోడల్: కోదండరాం

 

ఢిల్లీ :

తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కాన్సిస్టుట్యూషన్ క్లబ్ లో “తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన – అభివృద్ధి – వాస్తవాలు” / “Nine Years of KCR misrule” అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకి టీజేఏస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం గారు మాట్లాడుతూ.. “సీఏం కేసీఆర్ టీఆర్ఏస్ ను బీఆర్ఏస్ గా మార్చి దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఏ సమస్యలను పూర్తిగా పరిష్కరించారని ఇవాళ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ? ప్రస్తుతం దేశంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. కెసిఅర్ మోడల్ అంటే విధ్వంసకర మోడల్ అని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మొదటి వరుసలో ఉంది. ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏళ్లుగా విడుదల కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. సీఏం కేసీఆర్ పాలనలో అమలవుతున్న వ్యవసాయ విధానం గుప్పెడు మంది భూస్వాములకు లాభం చేకూరేలా ఉంది. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులకు భరోసా లేకుండా పోతుంది. ఇదేనా తొమ్మిదేళ్లుగా సీఏం కేసీఆర్ చేసిన అభివృద్ధి ? ఈ తెలంగాణ మోడల్ నేనా దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టింది ? అని ప్రష్ణించారు.

ఈ సదస్సుకి ముఖ్య వక్తగా వచ్చిన రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త డీఏల్ నర్సింహ్మ రెడ్డి మాట్లాడుతూ.. “టెక్నికల్ అసైన్మెంట్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారని కాగ్ రిపోర్ట్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు భారీగా దారి మళ్లాయి. ఇవి కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్లాయి. సీఏం కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు గొప్పగా చూపిస్తారు. కానీ ఖర్చు చేయడంలో వెనక్కి వెళ్తారు. గత తొమ్మిదేళ్లుగా SC, ST, OBC, మైనార్టీల వర్గాలకు కేటాయించిన బడ్జెట్ లలో దాదాపు 38% ఖర్చు చేయనే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన 2014-15 సంవత్సరంలో విద్యకు 11% నిధులు కేటాయిస్తే, నేడు 6% శాతానికి తగ్గించారు” అని అన్నారు.

మరో వక్త ప్రొ. అజయ్ గుడవర్తి మాట్లాడుతూ.. “కేసీఆర్ పాలనలో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంతో పాటు సామాజిక సంక్షోభం కూడా రాబోతుంది. రోజురోజుకు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. తెలంగాణలో స్కూల్ లెవల్ లో డ్రాపవుట్ శాతం పెరుగుతుంది. అంతే వేగంగా చైల్డ్ లేబర్ శాతం పెరుగుతుంది. రేషనైలేజేషన్ పేరుతో దాదాపు 4000 ప్రభుత్వ బడులను మూసి వేశారు. మరొక వైపు 30% ప్రయివేటు బడులు కొత్తగా వెలిసాయి. ప్రయివేటు యూనివర్శిటీలకు తెలంగాణ కేంద్రంగా మారింది. కులాల పునరుద్ధరణ పేరుతో పేద వర్గాలను చదువుకు దూరం చేసే నూతన సోషల్ విజన్ ను కేసీఆర్ అమలు చేస్తున్నారు.

మరో వక్త రైతు స్వరాజ్య వేదిక నాయకులు కిరణ్ విస్సా మాట్లాడుతూ.. ” కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తూ, రైతులకు వచ్చే మిగతా ప్రయోజనాలు తుంగలో తొక్కుతుంది. రైతు బంధు వల్ల అధిక భూమి కలిగిన యజమానులకే లాభం జరుగుతుంది. కానీ చిన్న, సన్నకారు రైతులకు పెద్దాగా ప్రయోజనం లేకుండా ఉంది. 22 లక్షలు ఉన్న కౌలు రైతులకు కేసీఆర్ ప్రభుత్వం నుండి ఒక్క పైసా లాభం చేకూరడం లేదు. ఓకేసారి ఋణమాఫీ చేయక పోవడం వల్ల రైతులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి” అని ఉన్నారు.

మరో వక్త ప్రొ. అజిత్ ఝా మాట్లాడుతూ.. “ఏన్నో ఉద్యమ ఆంక్షాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నేడు ఉద్యమ విలువలు లేవు. ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు టీజేఏస్ అధినేత ప్రొ. కోదండరాంతో కలిసి పనిచేస్తాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బైరి రమేష్, ఆశప్ప, నిజ్జన రమేష్,రైతుసమితి అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి,శ్రీధర్ యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాష, మహిళా జన సమితి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ, విద్యార్థి జన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ వినోద్ కుమార్, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest