హైదరాబాద్,
పోలీస్ శాఖలో వరుసగా బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏసీపీ, డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా సిటీలో వి ఐ పీ జోన్ గా పిలిచే బంజారాహిల్స్ , జూబిలీహిల్స్ ప్రాంతాల్లో అధికారులను బదిలీ చేశారు. బంజారాహిల్స్ ఏ సి పీ గా ఉన్న సుదర్శన్ ను బదిలీ చేసి హెడ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమన్నారు. సి సి ఎస్ లో ఏ సీ పీ గా పని చేస్తున్న సిహెచ్. సుధీర్ ను బంజరాహిల్స్ గా నియమించారు. జూబిలీహిల్స్ ఏ సి పీ గా కొంపల్లి లో పని చేస్తున్న సుబ్బయ్యను నియమించారు. ఇది కొత్తగా క్రేయేట్ చేసిన పోస్ట్ అని కూడా ఆర్డర్ లో పేర్కొన్నారు. సైఫాబాద్ ఏ సి పీ గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ రెడ్డిని బదిలీ చేసి హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ చెయ్యాలని ఆదేశాలిచ్చారు. ఆయన స్థానంలో రాచకొండలో పని చేస్తున్న ఆర్ . సంజయ్ కుమార్ ను సైఫాబాద్ ఏసీపీ గా నియమించారు. అంబర్ పెట్ ఏసీపీ పోస్ట్ ను కూడా కొత్తగా క్రేయేట్ చేశారు. ఇక్కడ ఇంటలిజెన్స్ లో డీఎస్పీ గా ఉన్న కస్తూరి శ్రీనివాస్ ను నియమించారు. నిజామాబాదు , బెల్లంపల్లి, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా బదిలీలు జరిగాయి.
