RTC ప్రయాణికులపై నేటి నుంచి ‘టోల్’ భారం

 

  • అమల్లోకి కొత్త చార్జీలు
  • టోల్ చార్జీలను ఐదు శాతం పెంచిన కేంద్రం
  • గరుడ ప్లస్ నుంచి ఆర్డినరీ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ. 4 పెంపు
  • నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున పెంపు
  • టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే సిటీ బస్సుల్లోనూ రూ. 4 వడ్డింపు

హైదరాబాద్ :

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన నేటి నుంచి అదనపు భారం పడనుంది. ఇటీవల కేంద్రం పెంచిన ఐదుశాతం టోల్ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచే ఇది అమల్లోకి రానుండడంతో ప్రయాణికులు అదనంగా చెల్లించుకోక తప్పదు. గరుడ ప్లస్ మొదలు ఆర్డినరీ బస్సుల వరకు ఒక్కో టికెట్‌పై 4 రూపాయలు, ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున టోల్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ అదనంగా రూ. 4 వసూలు చేయనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest