TS BUDJET – బడ్జెట్ పై కోదండరాం కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఇలా స్పందించారు.

హైదరాబాద్
1)నిరుద్యోగుల గురించి, ధరల పెరుగుదల కారణంగా అవస్థలు పడుతున్న వివిధ వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపని బడ్జెట్
2) ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలుగా ప్రకటించిన పథకాలకు మొండిచెయ్యి. నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం, దళితులకు మూడు ఎకరాల భూమి, బాగా వెనుకబడిన తరగతుల సంక్షేమం ఊసే లేదు.
3)సంక్షేమానికి భారీగా కేటాయింపులు అన్నది అవాస్తవం, పోయిన సారికన్నా పెద్దగా పేరుగ లేదు.
4)53 శాతం కల బిసిలకు ఇచ్చింది కేవలం 6229 కోట్ల రూపాయలు మాత్రమే
5) చిన్న, సన్న రైతులు, ఆ మాట కొస్తే మొత్తం గానే పేద రైతుల అభ్యున్నతికి చేసింది శూన్యం. రుణమాఫీ తప్ప వారికీ తోడ్పాటు అందించ గల పథకం లేదు.
6) తెలంగాణాలో ప్రత్యామ్నాయ పంటలకుగా ఎదుగ గలిగే అవకాశం ఉన్నది. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, చెరుకు, పసుపు, మిర్చి, మక్క వంటి పంటల వ్యాప్తికి చర్యలు లేవు. తెలంగాణకు పనికి రాని ఆయిల్ ఫాం పంట కొరకు 1000 కోట్ల కేటాయింపు.
7)అసలు పేదల కోసం బడ్జెట్ లో కేటాయింపులు తక్కువ. ఎకైజ్, అమ్మకం పన్ను కింద పన్నులు కడుతున్నది పేద ప్రజలు. అయినా ఆ వర్గాలకు దక్కుతున్నది నామమాత్రమే. ధరల పెరుగుదల కారణంగా నష్టపోయిన చిరువ్యాపారులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి బడ్జెట్ నుండి సహాయం లేదు.
8) ఉద్యోగ కల్పనకు చర్యలు లేవు. నైపుణ్యాన్ని పెంచగల పథకాలు, శిక్షణా కేంద్రాలు, ఉపాధి కల్పనా కోసం చేయవలసిన పెట్టుబడులు లేవు. ఉదాహరణకు ఉపాధి కల్పనకు చిన్న పరిశ్రమలు, గృహ పరిశ్రమలను ప్రోత్సహించ వచ్చు.
9)నిధులు భారీగా పెరిగింది రోడ్లు, బిల్డింగులు, సాగునీరు రంగాలకే. గత అనుభవాలను చుస్తే ఈ రంగాల కేటాయింపులు కాంట్రాక్టర్లకు ఉపయోగ పడ్డాయి.
10)పంచాయతీ రాజ్ శాఖకు చేసిన కేటాయింపులు నేరుగా గ్రామ పంచాయతీ వ్యవస్థకే చేరాలి.
11)ఇప్పటికీ ప్రభుత్వం గ్రమాభివ్రుదికి చేసిన కార్యక్రామాలను చేపట్టింది సర్పంచులే. నిధులు అందక కార్యక్రమాలు చేపట్టి అప్పుల పాలైన సర్పంచులకు ఊరట కలగాలి.
12)విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఇతర రాష్ట్రాలు చేస్తున్న దానికన్నా తక్కువ. అన్ని రాష్ట్రాలు విద్యపై రాష్ట్ర ఆదాయంలో 15 శాతాన్ని, వైద్యం పైన 6 శాతాన్ని ఖర్చు చేసినాయి. మన రాష్టం విద్యపైన మొత్తం ఆదాయంలో 7.3 శాతాన్ని, వైద్యం పైన 5 శాతాన్ని ఖర్చు చేస్తున్నాయి. కేటాయింపులు పెంచాలి.
13)కాళేశ్వరం పూర్తయిందని చెప్పడం అబద్దం. హెడ్ వర్కు మాత్రమే పూర్తయింది. కాలువలు, రిజర్వాయర్లు పూర్తి కాలేదు.
14)౩ లక్షల కోట్లతో బడ్జెట్ ఇంతవరకు ఏ రాష్ట్రం పెట్టలేదని చెప్పు తున్నారు కానీ వాస్తవం ఏమిటో చూడాలి. గతంలో అంచనాలకు వాస్తవాలకు తేడా వున్నది. పోయిన సంవత్సరం ప్రభుత్వం 2,45,000 కోట్లు అంచనా వేస్తె ఇప్పటి వరకు వసూలైనది 1,39,000 కోట్లు. మిగిలిన ఈ రెండు నెలల్లో వచ్చేది మహా అయితే మరొక 20,000 కోట్లు మించదు. పర్యవసానం కేటాయింపులలో కోట విధిస్తారు. అనివార్యంగా సంక్షేమ పథకాల కేటాయింపులు తగ్గుతాయి. కాగ్ నివేదికల ప్రకారం సంక్షేమ కేటాయింపులు 40 నుండి 60 శాతం తగ్గినాయి.
15)లోటు పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నది. రాష్ట్ర ఆదాయంలో ప్రతి రూపాయిలో 35 పైసలు అప్పే. కొత్తగా తెస్తున్న ప్రతి రూపాయిలో 70 పైసలు పాత అప్పు కట్టడానికే పోతున్నది. అందువలన అప్పు తెచ్చినా ఆదాయం పెరిగే అవకాశం లేదు. పోయిన రెండు సంవత్సరాల నుండి చేసిన అప్పు ప్రభుత్వం నడపదానికే వాడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకున్నది అని సూచిస్తున్నది.
16)తలసరి ఆదాయం బాగా ఉన్నదని చెప్పుతున్న ప్రభుత్వం ఒక విషయాన్ని దాచి పెడుతున్నది. హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల తలసరి తక్కువ.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest