హైదరాబాద్, మార్చి 16 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రద్దు చేసి, నిరుద్యోగులకు న్యాయం చెయ్యాలని ఒస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఈ ర్యాలీకి భారీగా విద్యార్ధిని, విద్యార్థులు హాజరైయ్యారు. ఇప్పటికే పేపర్ లీక్ అయినా పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన తరువాత పోలీసులు కూడా ఏమి చెయ్యలేని పరిస్థితికి వచ్చారు. శాంతి యుతంగా పోరాటం చేసి ఉద్యోగాలు సాధించుకుందాం అని విద్యార్థులు నినాదాలు చేశారు.
Post Views: 57