TV9 కుక్క తోక వంకర

హైదరాబాద్ :

రాజధాని నగరం హైదరాబాద్ లో ఓ చిన్నపిల్లాడిని కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన అందరిని కలచివేసింది. కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఈ సంఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీ హెచ్ ఎం సి) మేయర్ విజయ లక్ష్మి చాలా నిర్లక్ష్యంగా కుక్కలు ఆకలితో ఉన్నాయంటూ ఓ వెకిలి నవ్వు నవ్వింది. దీనిపై టివి 9 చర్చ చేపట్టింది. మేయర్ టీవీ 9 స్టూడియోకు వచ్చి సమాధానం చెప్పాలని ఆ స్టూడియోలో కూర్చన్న వ్యక్తుల ప్రధాన డిమాండ్. చర్చ సుమారు గంటకు పైగానే సాగింది. చెప్పవచ్చు. నిత్యం పనికిమాలిన వ్యవహారాలతో మీడియాలో ఉండే సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చర్చ వేదికకు ముఖ్య అతిధిగా వచ్చాడు. ఒకరిద్దరు రాజకీయ పార్టీల నేతలు, సామజిక కార్యకర్తలు ఉన్నారు. జంతు ప్రేమికులు కూడా వచ్చారు. పశువుల డాక్టర్ కూడా ఉన్నాడు.

(రాంగోపాల్ వర్మ అండ్ కుక్కలను సమర్ధించిన మహిళా)

చర్చ బాగానే సాగింది. చాలా లోతుగా కూడా సాగింది. ఒకానొక దశలో రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం విందాం అని ఒక యాంకర్ (ఇద్దరు యాంకర్లు ఉన్నారు చర్చలో)కాస్త గట్టిగా అరచినట్టు మాట్లాడడంతో రామ్ గోపాల్ వర్మ ఆమెను స్వల్పంగా మందలించాడు. ఇక్కడ కావాలసింది రామ్ గోపాల వర్మ అభిప్రాయం కాదు … ఆ వ్యక్తి (ఎదురుగా ఉన్న ఒకరిని చూపిస్తూ ) చెప్పినట్టు న్యాయం జరగాలి. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం కన్నా సమస్య దాని పరిష్కారం కు ప్రియరిటి ఇవ్వండి అని యాంకర్లకు హితబోధ కూడా చేశాడు. మేయర్ పై కేసు పెట్టడానికి ఈవేదిక సిద్ధమవుతోంది. దానికోసమే ఈ చర్చ అని యాంకర్లు పదే పదే చెప్పుకొచ్చారు. కుక్కల దాడిలో బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులను కూడా చర్చలోకి లైవ్ లో కూర్చోబెట్టారు.

( కుక్కలను సమర్ధించిన మహిళాపై కొడుకును పోగొట్టుకున్న తండ్రి సీరియస్)

ఈ సంఘటనకు ఎవరు కారణం ? అన్న ప్రశ్నకు పశు ప్రేమికురాలు ఒకరు తల్లిదండ్రులే కారణం అని సమాధానం చెప్పడంతో చర్చలో పాల్గొన్న వ్యక్తులు అందరు ఆమెపై తిరగబడ్డారు. పశువుల డాక్టర్ ను సైతం మాట్లాడనివ్వకుండా చేశారు. అసలు రామ్ గోపాల్ వర్మ ను ఈ చర్చకు పిలుస్తున్నారని ముందే తెలిసి ఉంటె తాము వచ్చే వాళ్ళము కాదు అని డాక్టర్ పక్కన కూర్చున్న ఒకావిడ వ్యాఖ్యానించారు. ”కుక్కలా- మనుషులా” అంటూ సాగిన ఈ చర్చ ఆద్యంతం ”మానవత్వం” వైపుకు సాగింది. ఒకానొక దశలో తల్లిదండ్రులే క్రాంమని చెప్పిన ఆ మహిళపై తిరగబడ్డ పురుష జనం అసలు నీకు మానవత్వం లేదా.. ని కొడుకు అయితే ఇలాగే మాట్లాడుతావా? నీకు పిల్లలు ఉన్నారు కదా ? అంటూ నిలదీశారు. కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఆ తండ్రి కూడా ఆ పశు ప్రేమికురాలిపై విరుచుకుపడ్డాడు. ఇక్కడ అలా ఆమె వ్యాఖ్యానించడం తప్పే కాబట్టి వారంతా ఆమెపై తిరగబడ్డారు.

( కుక్కలను సమర్ధించిన మహిళాపై తిరగబడ్డ చర్చలో పాల్గొన్న వ్యక్తులు )

చర్చ జరుగుతున్న సమయంలో మేయర్ రావాలి ..క్షేమాపణ చెప్పాలి అని గట్టిగ అరచిన రామ్ గోపాల్ వర్మ చర్చ నుంచి వెళ్ళిపోడానికి కిందికి దిగారు. కానీ ఆయన్ని ఈ పురుష పుంగవులంతా ఆపేశారు. దీంతో వర్మ వెళ్లి మళ్ళీ తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు.ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించిందని అక్కడే ఉన్న ఓ లాయరు చెప్పారు .

(కుక్కల దాడిలో పిల్లాడిని కోల్పోయిన తల్లిని ఓదారుస్తున్న యాంకర్ )

ఇదంతా బాగానే ఉంది … మంచి కోసమే చర్చ జరిగింది. మానవత్వం ఉన్న వాళ్లంతా ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. కానీ ఈ చర్చ జరిగిన యూట్యూబ్ టైటిల్ ఒక సారి చూడండి..ఏం పెట్టారో.. ఇక్కడ ప్రియరిటి వర్మ గురించి కాదు అని ఆర్ జీ వి పలుమార్లు చెప్పినా టివి 9 టైటిల్ ఆయన గురించి మాత్రమే పెట్టింది. కుక్క కాటుకు ‘చెప్పు” జవాబు అని టైటిల్ పెట్టి చర్చ పెట్టిన టివి 9 మాత్రం ”కుక్క తోక వంకర” అన్నటు చేసింది. ”నేను వెళ్ళిపోతా…. స్టూడియో లో ఆర్జీవీ సీరియస్ ” అని యూట్యూబ్ కింద టైటిల్ పెట్టారు. అంటే మానవత్తం గురించి చర్చ పెట్టిన టివి 9 ఇక్కడ పూర్తిగా మానవత్వం మర్చిపోయిందని చెప్పాలి. ఎందుకంటే టివి 9 మెరుగైన సమాజం కోసం అప్పుడప్పు ఇలాంటి మంచి చర్చలు పెట్టినా తన వక్రబుద్ధి మాత్రం మార్చుకోలేదు అని స్పష్టమైంది.

ఈ చర్చ సమస్య ఉత్పన్నమైందనుకు కాదు కానీ రామ్ గోపాల్ వర్మ వస్తా అన్నందుకే పెట్టినట్టు ఉంది. అందుకే కాబోలు సమస్య మీద టైటిల్ పెట్టకుండా రామ్ గోపాల్ వర్మ మీద టైటిల్ పెట్టారు. అందుకే ”కుక్క తోక వంకర” అని అనేక తప్పదు .ఇంతకీ మేయర్ స్పందించిందా ? అంటే లేదు ? పోనీ ఈ చర్చలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ తో సహా మిగితావాళ్లెవరైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? అంటే అదీ లేదు. మరి టివి 9 చర్చ ఎందుకు పెట్టినట్టు ? రామ్ గోపాల్ వర్మకు భజన చేయడానికా?

మంచిర్యాల జిల్లలో కుక్కల దాడి !
హైదరాబాద్ లో కుక్కలదాడి ఘటన మరవకముందే మంచిర్యాల జిలాల్లో ఓ బాలుడిపై పిచ్చి కుక్క దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా, మందమర్రి లోని మూడవ జోన్ లో బాలుడిపై పిచ్చి కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన ఆ బాలున్ని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు.

 

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest