TS& APకి రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు

 

  • తెలంగాణ రాష్ట్రానికి 4,418 కోట్లు కేటాయింపు , ఇది గతేడాది కంటే 45% అధికం
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ 8,406 కోట్లు కేటాయింపు , ఇది గతేడాది కంటే 20% అధికం
  • దక్షిణ మధ్య రైల్వే కు బడ్జెట్‌లో అత్యధిక మొత్తం రూ 13,786.19 కోట్లు కేటాయింపు
  • ఇది గత సంవత్సరం కంటే దాదాపు 65% అధికం
  • దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

హైదరాబాద్ :

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ 01 ఫిబ్రవరి , 2023న పార్లమెంటు లో సమర్పించబడింది. మౌలిక సదుపాయాల కల్పన ,బడ్జెట్ కేటాయింపుల సమగ్ర వివరాలను కలిగి ఉన్న పింక్ బుక్ ఈ రోజు ఫిబ్రవరి 03, 2023న పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి పత్రిక సమావేశం నిర్వహించారు. 2023-2024 సంవత్సరానికి గాను దక్షిణ మధ్య రైల్వే కేటాయింపుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు : దక్షిణ మధ్య రైల్వేకు అధిక మొత్తంలో 2023-24 సంవత్సరానికి రూ. 13,786.19 కోట్లు. 2022-23 సంవత్సరానికి 8,349.75 కోట్లు, ఇది గత సంవత్సరం కంటే దాదాపు 65% అధికం
• డబ్లింగ్, మూడవ లైన్ మరియు బైపాస్ లైన్ పనుల కోసం మూలధన కేటాయింపు ల మొత్తం రూ. 3,374.44 కోట్లు. గత సంవత్సరం కేటాయింపు రూ. 1,531 కోట్లు .
• కొత్త లైన్ల కోసం, క్యాపిటల్ మరియు సేఫ్టీ ఫండ్ (డిపాజిట్ మినహా)తో సహా మొత్తం బడ్జెట్ గ్రాంట్ రూ. 819 కోట్లు, గత సంవత్సరం రూ. 285 కోట్లు .

• విద్యుదీకరణ పనుల కోసం, బడ్జెట్ గ్రాంట్ రూ. 588 కోట్లు.
2023-24లో కొన్ని ముఖ్యమైన భద్రత పనులకు బడ్జెట్ కేటాయింపులు: –
 రోడ్డు భద్రత పనులకు (లెవల్ క్రాసింగ్‌లు, వంతెనలు మరియు ఆర్ ఓ బి /ఆర్ యూ బి ) లకు 768.14 కోట్లు, గత సంవత్సరంలో కేటాయించిన రూ. 758 కోట్లు
 ట్రాక్ పునరుద్ధరణ పనులకు రూ. 1,360 కోట్లు, అంతకు ముందు సంవత్సరంలో కేటాయించిన రూ. 1,040 కోట్లు

కవచ్ అభివృద్ధి కోసం రూ. 68.34 కోట్లు కేటాయించబడింది. ఇందులో భాగంగా
వాడి-రేణిగుంట, దువ్వాడ-విజయవాడ, బల్హర్షా-విజయవాడ-గూడూరు, మన్మాడ్- పర్భాని- నాందేడ్- సికింద్రాబాద్- గద్వాల్- ధోనేగుంతకల్, బీదర్-పర్లి వైజనాథ్-పర్భాని మరియు వాడి-గుంతకల్ విభాగాల్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్‌ల కోసం బడ్జెట్ కేటాయింపులు క్రింది విధంగా ఉన్నాయి:
 మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుకు రూ. 345 కోట్లు కేటాయింపు
ఈ ప్రాజెక్టు 1997-98 సంవత్సరంలో 244 కి.మీ.ల మేర పనులకు మంజూరైన నిధులు రూ. 1,723 కోట్లు. 244 కిలోమీటర్లలో, 68 కిలోమీటర్లు దక్షిణ మధ్య రైల్వే (తెలంగాణ రాష్ట్రం) పరిధిలోకి వస్తాయి మరియు ఆ భాగానికి మంజూరైన వ్యయం రూ. 452 కోట్లు. మిగిలిన 178 కిలోమీటర్ల భాగం నైరుతి రైల్వే (కర్ణాటక రాష్ట్రం)కి చెందినది. దేవరకద్ర-మాగనూరు మధ్య 54 కిలోమీటర్ల మేర సెక్షన్‌ను పూర్తి చేసి ప్రారంభించింది. కృష్ణా – మాగనూరు మధ్య 14 కి.మీ దూరం వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పనులు పూర్తయ్యాయి మరియు సి ఆర్ ఎస్ ధ్రువీకరణ కోసం గడువు ఉంది.

 నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 202 కోట్లు కేటాయింపు
2011-12 సంవత్సరంలో రూ.2, 289 కోట్లతో 309 కిలోమీటర్ల మేర పనులకు ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది . ప్రాజెక్టు వ్యయంలో 50% రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రాజెక్ట్ కు భూమిని ఉచితంగా ఇచ్చింది . న్యూ పిడుగురాళ్ల నుండి శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల మేర విభాగం పూర్తి చేసి విద్యుదీకరణతో పాటు ప్రారంభించడం జరిగింది మిగిలిన విభాగాల్లో పనులు కొనసాగుతున్నాయి.
 మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 185 కోట్లు కేటాయింపు
ఈ ప్రాజెక్టు 2006-07 సంవత్సరంలో 151 కి.మీ.ల మేర మంజూరైన రూ. 1,160 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మాణ ఖర్చుతో చేపట్టే ప్రాజెక్ట్. ఇందుకు 1/3వ వంతు ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరించనుంది .ఈ ప్రాజెక్ట్ కోసం భూమిని ఉచితంగా కేటాయిస్తారు . మనోహరాబాద్-కొడకండ్ల నుంచి 44 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తయింది. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
 కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయింపు.
ఈ ప్రాజెక్టు 2000-01 సంవత్సరంలో 57 కి.మీ.ల మేర పనులకు మంజూరైన నిధులు రూ. 2,120 కోట్లు. ప్రాజెక్టు వ్యయంలో 25% ఏపీ ప్రభుత్వం భరించనుంది . ఈ విభాగంలో కొత్త లైన్ పనులు గౌతమి, వైనతేయ మరియు వశిష్ట నదులపై ముఖ్యమైన ప్రధాన వంతెనల నిర్మాణంలో ఉన్నాయి.ప్రస్తుతం అవి పురోగతిలో ఉన్నాయి.
 బీదర్ – నాందేడ్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయింపు.
2018-19 సంవత్సరంలో 155 కి.మీ.ల మేర ఈ ప్రాజెక్ట్ మంజూరైన నిధులు రూ. 2152 కోట్లు. ప్రాజెక్ట్ వ్యయంలో 50% భరించేందుకు కర్ణాటక ప్రభుత్వం సమ్మతిని తీసుకొవడం జరిగింది .ఆలాగే మహారాష్ట్ర ప్రభుత్వం భూమిని ఉచితంగా కేటాయించింది .
 భద్రాచలం – కొవ్వూరు కొత్త లైన్‌ ప్రాజెక్టుకు రూ. 20 కోట్లు కేటాయింపు
2012-13 సంవత్సరంలో 151 కి.మీ.ల మేర పనులకు గాను ఈ ప్రాజెక్టు కోసం మంజూరైన నిధులు రూ. 1,445 కోట్లు అనంతరం రూ. 2,154.83 కోట్లకు సవరించబడింది.

 మణుగూరు-రామగుండం కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 10 కోట్లు కేటాయింపు.
2013-14 సంవత్సరంలో 200 కి.మీ.ల మేర పనులకు గాను ఈ ప్రాజెక్టు మంజూరైంది. రూ. 1,112 కోట్లు అనంతరం రూ. 2911 కోట్లకు సవరించబడింది.
కొన్ని ముఖ్యమైన డబ్లింగ్ / థర్డ్ లైన్ అలాగే బై-పాస్ లైన్ ప్రాజెక్ట్‌లకు కేటాయింపులు మరియు వాటి స్థితి క్రింది విధంగా ఉంది.
 ఎం ఎం టి ఎస్ రెండవ దశ ప్రాజెక్ట్ కోసం రూ. 600 కోట్లు కేటాయింపు
2012 -2013 సంవత్సరానికి గాను మంజూరైన నిధులు రూ. 817 కోట్లు. ఇప్పటి వరకు పూర్తయిన విభాగాలు – మల్కాజిగిరి – బోలారం 14 కి.మీ మేర డబుల్ లైన్ విద్యుదీకరణ , తేలాపూర్ – రాంచంద్రపురం 6 కి.మీ., మేడ్చల్-బోలారం డబ్లింగ్ 14 కి.మీ, మౌలాలీ – ఘట్‌కేసర్ మధ్య 12.2 కి.మీ., ఫలక్‌నుమా-ఉందనగర్ మధ్య 1.5 కి.మీ. ప్రస్తుతం, సనత్ నగర్ నుండి మౌలాలీ వరకు విద్యుదీకరణతో డబ్లింగ్ మరియు మౌలా అలీ – మల్కాజిగిరి – సీతాఫల్ మండి వరకు విద్యుదీకరణతో డబ్లింగ్ తో పాటు మరియు మరో రెండు విభాగాలలో పనులు జరుగుతున్నాయి.
 విజయవాడ-గూడూరు మధ్య 3వ లైన్ ప్రాజెక్టుకు రూ. 800 కోట్లు కేటాయింపు
3వ లైన్ ప్రాజెక్టు 2015-16 సంవత్సరంలో 288 కిలోమీటర్ల మేర పనులకు మంజూరైన నిధులు రూ. 3549 కోట్లు. గూడూరు-బిట్రగుంట, కరవది-బిట్రగుంట, కృష్ణా కెనాల్-కరవాడి మధ్య ఏకకాలంలో మూడు దశల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఉలవపాడు – తలమంచి మధ్య 64 కిలోమీటర్ల సెక్షన్‌, చినగంజాం – కరవడి మధ్య 23 కిలోమీటర్ల (మొత్తం 87 కిలోమీటర్లు) సెక్షన్‌ పూర్తయింది. బ్యాలెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

 గుంటూరు-గుంతకల్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ. 980 కోట్లు కేటాయింపు.
డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం 2016-17 సంవత్సరంలో 404 కి.మీల మేర పనులకు సంబందించి మంజూరైన నిధులు రూ. 3,631 కోట్లు. ఇందులో నల్లపాడు- సాతలూరు, ఎద్దులదొడ్డి- దోనె, చీకటీగలపాలెం- తర్లుపాడు మధ్య 159 కిలోమీటర్ల డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు పూర్తి కాగా, మిగిలిన వాటిలో పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి .
 కాజీపేట-విజయవాడ 3వ లైన్ ప్రాజెక్టుకు రూ.337.52 కోట్లు కేటాయింపు.
3వ లైన్ ప్రాజెక్టు 2012-13 సంవత్సరంలో 220 కి.మీ.ల మేర పనులకు గాను మంజూరైన నిధులు రూ. 1,953 కోట్లు. విజయవాడ – చెరువుమాధవ్రం విభాగాల మధ్య 19.2 కిలోమీటర్ల పనులు పూర్తయింది. మిగిలిన విభాగాల్లో పనులు కూడా పురోగతిలో వున్నాయి .
 కాజీపేట-బల్హర్షా 3వ లైన్ ప్రాజెక్ట్ (రాఘవపురం-మందమర్రి మినహా) కోసం రూ. 450.86 కోట్లు కేటాయింపు
2015-16 సంవత్సరంలో మంజూరైన 3వ లైన్ ప్రాజెక్టు 201 కి.మీ.ల మేర పనులకు గాను మంజూరైన నిధులు రూ. 2,063 కోట్లు. ఇందులో 50 కి.మీ వరకు రాఘవాపురం-పొత్కపల్లి ట్రిప్లింగ్ , విద్యుద్దీకరణ పనులు మరియు వీరూర్ – మాణిక్‌ఘర్ మధ్య పనులు పూర్తయ్యాయి . మిగిలిన విభాగాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

 గుత్తి -ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 90.6 కోట్లు కేటాయింపు:
2015-16 సంవత్సరంలో డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం 90 కి.మీ.ల మేర మంజూరైన నిధులు రూ. 714 కోట్లు. ఇందులో గుత్తి -చిగిచెర్ల మధ్య 79 కి.మీల డబ్లింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది .చిగిచెర్ల-ధర్మవరం మధ్య 11 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు చివరి దశ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

విజయవాడ-గుడివాడ/మచిలీపట్నం-భీమవరం/నర్సాపూర్-నిడదవోలు డబ్లింగ్, విద్యుద్దీకరణకు రూ. 100 కోట్లు కేటాయింపు.
డబ్లింగ్ ప్రాజెక్ట్ 2011-12 సంవత్సరంలో 221 కి.మీల మేర మంజూరైన రూ. 1,504 కోట్లు. మొత్తం సెక్షన్‌లో డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.
 ధర్మవరం-పాకాల-కాట్పాడి డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ. 40 కోట్లు కేటాయింపు.
ఈ ప్రాజెక్ట్ 2019-20లో 290 కి.మీ.ల మేర మంజూరైన రూ. 2,900 కోట్లు.
 గుంటూరు-బీబీనగర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ. 60 కోట్లు కేటాయించారు.
ఈ ప్రాజెక్ట్ 2019-20లో 248 కి.మీ.ల మేర మంజూరైన రూ. 2,480 కోట్లు.
 ముద్ఖేడ్ మరియు సికింద్రాబాద్ మీదుగా అకోలా-ధోన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.60 కోట్లు కేటాయించారు .(పూర్ణ – ముద్ఖేడ్ మరియు బోలారం – మహబూబ్‌నగర్ మినహా):
2019-20లో 612 కిలోమీటర్ల దూరం మేర పనులకు సంబంధించి రూ. 6,260 కోట్లు. రైల్వే బోర్డు సూచనల మేరకు బోలారం-మహబూబ్‌నగర్ మధ్య ఇప్పటికే పూర్తయిన విభాగాన్ని మినహాయించి ముద్‌ఖేడ్-ధోనే మధ్య ప్రాజెక్ట్ అమలు కోసం రైల్వే బోర్డు ఆదేశం మేరకు సమగ్ర అంచనాలతో తయారు చేయబడింది .
 బై పాస్ లైన్ల నిర్మాణం కోసం రూ. 383.12 కోట్లు కేటాయింపు
బైపాస్ లైన్లు : విజయవాడ (19.5 కి.మీ), కాజీపేట (10.65 కి.మీ), రేణిగుంట (9.6 కి.మీ), వాడి (7.6 కి.మీ) మరియు గూటి (3.8 కి.మీ) ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో బై-పాస్ లైన్ల నిర్మాణానికి రూ.383.12 కోట్లు కేటాయించారు. గుత్తి వద్ద బైపాస్ లైన్లు పూర్తయ్యాయి .మిగిలిన స్టేషన్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మిషన్ ఎలక్ట్రిఫికేషన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 638 రూట్ కి.మీ విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి . ప్రస్తుత సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌తో పోల్చిన అత్యధిక విద్యుదీకరణ పనులును దక్షిణ మధ్య రైల్వే పూర్తి చేసింది . ప్రస్తుత ఏడాది కేటాయింపులు రూ. 588 కోట్లు. కొన్ని విభాగాల వారీగా కేటాయింపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: –
 మన్మాడ్ – ముద్ఖేడ్ – ధోన్ విభాగానికి కేటాయించిన నిధులు రూ. 315.6 కోట్లు
2015-16 సంవత్సరంలో 783 కిలోమీటర్ల మేర పనులకు గాను మంజూరైన నిధులు రూ. 902 కోట్లు
 పింపాల్‌కుతి – ముధ్‌కేడ్ మరియు పర్భాని- పర్లి వైజనాథ్ సెక్షన్‌ల విద్యుద్దీకరణకు 132.33 కోట్లు కేటాయింపు
ఈ విభాగాల మధ్య 246 కి .మీ మేర 2017 -2018 సంవత్సరానికి గాను రూ . 277 కోట్ల నిధులు మంజూరయ్యాయి . పింపాల్‌కుటి-కోసాయి మధ్య 44 కిలోమీటర్ల దూరం వరకు విద్యుదీకరణ ఇప్పటికే పూర్తయింది.
 పూర్ణ -అకోలా మధ్య విద్యుదీకరణ కోసం కేటయించిన నిధులు రూ. 35 కోట్లు .
ఈ విభాగంలో 2017-18 సంవత్సరంలో 246 కిలోమీటర్ల పనులకు గాను రూ . 277 కోట్లు మంజూరయ్యాయి . అకోలా-హింగోలి విభాగం మధ్య 126 కి.మీ మేర విద్యుద్దీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి .

 పగిడిపల్లి -నల్లపాడు (285 రూట్ కి .మీ ) మధ్య విద్యుదీకరణ కోసం రూ . 32 .8 కోట్లు కేటాయింపు.

జోన్ వ్యాప్తంగా ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపుల వివరాలు –
 పెద్ద ఎత్తున్న స్టేషన్లపునరాభివృద్ది చేసేందుకు (అంబ్రెల్లా వర్క్స్) కోసం రూ 555 కోట్లు మంజూరు చేయడం జరిగింది .
 స్టేషన్ ల అభివృద్ధి పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే కు 215 కోట్లు మంజూరయ్యాయి.

 ట్రాఫిక్‌ సౌకర్యాల పనులకు రూ. 204 కోట్లు మంజూరయ్యాయి.
 కాజీపేటలో పీఓహెచ్ వర్క్‌షాప్ కోసం రూ. 160 కోట్లు కేటాయింపు
 స్వర్ణ చతుర్భుజ మార్గాలలో ఆర్ ఓ బి / ఆర్ యూ బి నిర్మాణానికి 200 కోట్లు మంజూరు .
 చర్లపల్లి స్టేషన్‌లోని శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి రూ. 82 కోట్లు కేటాయింపు
 కర్నూలులో మిడ్‌లైఫ్ పునరావాస ఫ్యాక్టరీకి రూ.125 కోట్లు కేటాయింపు
 తిరుచానూరు రైల్వే స్టేషన్‌ అభివృద్ధిక కోసం రూ. 8.5 కోట్లు కేటాయించారు.
 స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు మరియు అధిక స్థాయి ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు కోసం రూ .53.43 కోట్లు కేటాయించబడ్డాయి.
దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న ప్రాజెక్టుల అమలు కోసం గణనీయమైన రీతిలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రాష్ట్రాల వారీ కేటాయింపుల పరంగా:
2023-24లో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు & భద్రతా పనుల కోసం మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ. 4,418 కోట్లు కాగా, 2022-23లో రూ. 3,048 కోట్లు, ఇది 45% అధికం . ఇటీవలి కాలంలో వరుస బడ్జెట్‌లలో తెలంగాణకు నిధుల కేటాయింపులో స్థిరమైన పెరుగుదల .
 2023-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు & భద్రతా పనుల కోసం మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ. 8,406 కోట్లు కాగా, 2022-23లో రూ. 7,032 కోట్లు, ఇది 20% అధికం . 2009-14లో జరిగిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు 9.5 రెట్లు అధికంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్ కేటాయింపులు కూడా నిరంతరాయంగా పెరుగుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest