TS Eamcet-తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుల

  • అగ్రికల్చర్‌లో 86 శాతం
  • ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం
  • అడ్మిషన్‌  నోటిఫికేషన్‌ త్వరలో విడుదల

హైదరాబాద్‌:

తెలంగాణ ఎంసెట్‌ (TS Eamcet) ఫలితాలు విడులయ్యాయి. అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్‌ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac చూడవచ్చు. అడ్మిషన్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేస్తామని మంత్రి చెప్పారు.

ఎంసెట్‌ పరీక్షలను ఈ నెల 10 నుంచి 14 వరకు నిర్వహించారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు 94.11 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేసుకోగా 1,95,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షలకు 1,15,361 మంది అప్లయ్‌ చేసుకోగా 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest